Friday, January 27, 2017

కర్మయోగం

అర్జున ఉవాచ :-
జ్యాయసీచేత కర్మణస్తే మతా బుద్ధిర్జనార్ధన !
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ! 1
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా ! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో, భయంకరమైన ఈ యుద్ధకార్యమందు నన్నేల నియోగించుచున్నావు.

శ్రీభగవాన్ ఉవాచ :-
లోకేపాస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానషు !
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మాయోగేన యోగినామ్ ! 3
శ్రీభగవానుడు పలికెను - ఓ పాపరహితుడవైన అర్జునా ! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవు. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును.

న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోపాశ్నుతే !
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి ! 4  
మనుష్యుడు కర్మలను చేయకపోవుట వలన యోగనిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్ఠను అతడు పొందడు.

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ !
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ! 5 
ఎవడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. మనుష్యులందరును ప్రకృతినిత్యలైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతివ్యక్తియు అస్వతంత్రుడై కర్మను ఆచరింపవలసియే యుండును.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ !
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ! 6
బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియవ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియవిషయములను చింతించునట్టి మూఢుని డంభాచారి అని కపటుడు అని అంటారు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేపార్జున !
కర్మేంద్రియైః కర్మయోగమ్ అసక్తః స విశిష్యతే ! 7
అర్జునా ! మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారణమును కావించు పురుషుడుత్తముడు.

 నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యరకర్మణః !
శరీరయాత్రాపాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ! 8
నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర గూడ సిద్ధింపదు.

యజ్ఞార్థాత్ కర్మణోపాన్యత్ర లోకేపాయం కర్మబంధనః !
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార ! 9
ఓ అర్జునా ! యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు. కనుక ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః !
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ! 14
ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది.

కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవమ్ !
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ! 15
సత్కర్ములు యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై యున్నాడు.

తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార !
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః !! 19
అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.


 కర్మణైవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయః !
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి !! 20 
జనకుడు మున్నగువారు ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను చేయవలయును.

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన !
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి !! 22
ఓ అర్జునా ! ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలను చేయుచునే ఉన్నాను. 

యది హ్యహం న వర్తేయం  జాతు కర్మణ్యతంద్రితః !
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః !! 23
ఓ పార్థా ! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని వాటిల్లును. ఎందుకనగా మనుష్యులందరును సర్వ విధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. 

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ !
సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః !! 24 
నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు. లోకములందు అల్లకల్లోలములు ఏర్పడును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను.

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత !
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ !! 25
ఓ అర్జునా ! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఫలాపేక్ష లేక కర్మలను చేయవలెను. 

న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినామ్ !
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ !! 26 
పరమాత్మ స్వరూపము నందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను. 

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః !
అహంకారవిమూఢాత్మా కర్తాపాహమితి మన్యతే !! 27
వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావింపుచుచున్నాడు. 

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః !
గుణా గుణేషు వర్తంత ఇతి ముత్వాన సజ్జతే !! 28 
ఓ మహాబాహో ! అర్జునా ! గుణవిభాగతత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తి నొందడు.

ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు !
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ !! 29
ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి కర్మసంగులను అల్పజ్ఞులను, మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు గురిచేయరాదు.


మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా !
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః !! 30
సమస్త కర్మలు నా యందు సమర్పించి, ఆశగాని, మమకారము గాని లేనివాడవై నిర్భయముగా యుద్ధము చేయుము.

యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవాః !
శ్రద్ధావంతోపానసూయంతో ముచ్యంతే తేపాపి కర్మభిః !! 31
శ్రద్ధాయుక్తులై అసూయలేనివారై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు.

No comments:

Post a Comment