Thursday, January 1, 2015

కర్మయోగము

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత !
కుర్యాద్విద్వాంస్తథాసక్తః  చికీర్షుర్లోకసంగ్రహమ్  !!  25

ఓ అర్జునా ! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఫలాపేక్ష లేక కర్మలను చేయవలెను.
 
కర్మయోగములో జగద్గురువు చాలా స్పష్టముగా చెప్తున్నది ఏమిటంటే మనకు బాగా తెలిసి ఈవిధముగా చేస్తే మంచిదని మనకు తెలిసినా అది మన వరకే పరిమితి అవ్వాలి తప్ప ఎవరికి మనం నోటితో ఏదీ చెప్పక్కరలేదు మంచికానీ, చెడుకానీ. మన ఆచరణ మన చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తుంది మనం ఏమిటి అని. మనం ఎవరిని lead చెయ్యక్కరలేదు ఎవరి పరిణామక్రమములో వారు ముందుకు వెళ్తూ ఉంటారు.
సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వసమర్ధుడుని ఏమైనా అడగవచ్చు ఎప్పుడు అడగవచ్చు అంటే మన ప్రయత్నం అంతా మనం చేసి అప్పుడు. కర్మ చేయకుండా ఆ గురువునో, దైవాన్నో నువ్వే అంతా చేసేయి అంటే చెయ్యడు. జుట్టు, గోళ్ళు ఎలా పెరుగుతాయో, నిరంతరం రక్తం శరీరములో ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, శరీరము లోపలి అంగాలు నిరంతరం ఎలా పనిచేస్తూ ఉంటాయో అలా అంత సహజంగా ఓర్పుతో, నేర్పుతో బాధ్యతలు నిర్వహించడమే (కర్మ చేయడమే) యోగము.  ప్రకృతే అంతా చేయిస్తోందని తెలిసినా మన ప్రయత్న లోపం లేకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళడమే నిజమైన యోగము.