జాయతే సతతం సఖ్యం సర్వజీవగణైః
సహ
ప్రారబ్ధం భుజంతో వాపి
గీతాభ్యాసరతస్యచ ||32||
సముక్తః ససుఖి లోకే కర్మణా
నోపలిప్యతే
మహాపాపాది పాపాని గీతాధ్యాయి
తరోతిచేత్
న కించత్ స్పృశ్యతే తస్య
నలినీదలమంభసా ||33||
గీతాభ్యాసతత్పరుడు ప్రారబ్ధమును అనుభవించుచున్నను, సమస్త
భూతకోట్లతో నిరంతరము సఖ్యము కలిగి ఉండును. మరియు అతడు ముక్తుడును, సుఖవంతుడు అగును. కర్మలచే అంటబడకనే యుండును. తామరాకును నీరు అంటనట్లు మహాపాపాదులు
అతనిని అంటవు.
గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్
యద్యత్కర్మ చ సర్వత్ర గీతాపాఠ ప్రకీర్తితమ్
తత్తత్కర్మ చ నిర్ధోషం భూత్వా పూర్ణత్వ మాప్నుయాత్
||62||
గీత అను శబ్దమును ఉచ్చరించుచు మరణించువాడు
సద్గతిని బడయును (పొందును). గీత యొక్క పఠనము, సంకీర్తనము గావించుచు ఏ ఏ కర్మ
చేయబడుచుండునో అది అంతయు దోషరహితమై పూర్ణత్వమును పొందుచుండును.