Saturday, November 15, 2014

గీతా మహిమ - కర్మకు సంబంధించిన శ్లోకాలు - వైష్ణవీయ తంత్రసారము నుండి

జాయతే సతతం సఖ్యం సర్వజీవగణైః సహ
ప్రారబ్ధం భుజంతో వాపి గీతాభ్యాసరతస్యచ  ||32||
సముక్తః ససుఖి లోకే కర్మణా నోపలిప్యతే
మహాపాపాది పాపాని గీతాధ్యాయి తరోతిచేత్  
న కించత్ స్పృశ్యతే తస్య నలినీదలమంభసా  ||33||
 
గీతాభ్యాసతత్పరుడు ప్రారబ్ధమును అనుభవించుచున్నను, సమస్త భూతకోట్లతో నిరంతరము సఖ్యము కలిగి ఉండును. మరియు అతడు ముక్తుడును, సుఖవంతుడు అగును. కర్మలచే అంటబడకనే యుండును. తామరాకును నీరు అంటనట్లు మహాపాపాదులు అతనిని అంటవు.   
 
గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్
యద్యత్కర్మ చ సర్వత్ర గీతాపాఠ ప్రకీర్తితమ్
తత్తత్కర్మ చ నిర్ధోషం భూత్వా పూర్ణత్వ మాప్నుయాత్ ||62||
 
గీత అను శబ్దమును ఉచ్చరించుచు మరణించువాడు సద్గతిని బడయును (పొందును). గీత యొక్క పఠనము, సంకీర్తనము గావించుచు ఏ ఏ కర్మ చేయబడుచుండునో అది అంతయు దోషరహితమై పూర్ణత్వమును పొందుచుండును.     
 
 

Friday, November 14, 2014

శ్రీ గీతామహత్యం - కర్మకు సంబంధించిన శ్లోకాలు - శ్రీ వరాహపురాణం నుండి

ధరోవాచ
భగవన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో ||            1
భూదేవి: భగవంతుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధం అనుభవించేవాడికి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది?

శ్రీ విష్ణురువాచ
ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
సముక్త స్స సుఖీ లోకేకర్మణా నోపలిప్యతే ||                2

శ్రీమహావిష్ణువు: భూదేవీ! ప్రారబ్ధం అనుభవిస్తున్నా నిరంతరం గీతను అభ్యసించేవాడు లోకంలో ముక్తి పొంది, సుఖపడతాడు; కర్మలకు బద్ధుడు కాడు.