Thursday, January 19, 2017

సాంఖ్యయోగం

ఏషా తేపాభిహితా సంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు !
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యాసి ! 39
ఓ పార్థా ! సాంఖ్య శాస్త్రమున చెప్పబడిన ఈ సమత్వబుద్ధిని గురించి తెల్పితిని. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, వినుము. దానిని ఆకళింపు చేసికొని, ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యెదవు.


యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యంవిపశ్చితః !
వేదవాదరాతః పార్థ నాన్యదస్తీతి వాదినః ! 42

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ !
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ! 43

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ !
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ! 44

అర్జునా ! వేదవాదములందు రమించువారు, కామ్య కర్మలే అధికమని వాదించువారు, స్వర్గమే ఉన్నతమైనది భావించి ఇలా అంటారు.

కోరికలతో కూడినవారు, స్వర్గాభిలాషులును, జన్మమును, కర్మఫలము నొసగునట్టిదియును, భోగైశ్వర్యముల నిచ్చునదియు.


భోగైశ్వర్య ప్రసక్తికల వారలకు నిశ్చితమైన బుద్ధి ఉండదు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన !
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోపాస్త్వకర్మణి ! 47

కర్తవ్యకర్మము నాచారించుట యందే నీకు అధికారము గలదు కాని ఎన్నాటికినీ దాని ఫలముల యందులేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ !
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ! 48

ఓ ధనంజయా ! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, కార్యములు ఫలించినను ఫలించుకున్నను సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు.


దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్దనంజయ !
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ! 49

ఓ అర్జునా! ఈ సమత్వబుద్ధితో కూడిన నిష్కమ కర్మకంటే ప్రతిపలాపేక్షతో కూడిన సకామకర్మ తక్కువైనది. కాబట్టి నీవు సమత్వబుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, కృపణులు.


బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే !
తస్మాద్యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలమ్ ! 50

సమస్త బుద్ధియుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును అశ్రయింపుము. ఇదియే కర్మాచరణము నందు కౌశలము. ఇదియే యోగము.

కర్మజం బుద్ధియుక్తా ఫలం త్యక్త్వామనీషిణః !
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయమ్ ! 51

ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన మోక్షపదమును పొందుదురు.



No comments:

Post a Comment